క్రీస్తేసు సిలువపై దృష్టినుంచి - ఆయన కృపయందే నిలుచుండుము
పరలోక మహిమ కిరీటముకై - క్రీస్తేసు అడుగులలో నడువుము
క్రీస్తేసు సిలువపై దృష్టినుంచు
1. సమాదాన దేశం పరలోకము - ఎన్నో దీవెనలు కలవందున
ఇహలోక శాంతి క్షణమాత్రమే - గొప్ప శిక్ష యందు దాగియుండె
2. క్రీస్తు నుండి నిన్ను దూరపరచ - లోకాశలు నిన్ను ఆకర్షించు
సిలువను చూడక పోయినచో - చిక్కుకొనెదవు ఈ లోకములో
3. ప్రభుయేసు సహవాసమున నిలిచి - సాతానుకు స్థలమియ్యకుము
ఏవి క్రీస్తునుండి విడదీయునో - యేసు రక్తమందు కడుగుకొనుము
4. పరలోక దీవెనలు రుచిచూడను - ఆశతో వెళ్ళను సిద్ధపడు
లోకమునకు నీవు వేరైనచో - ఆత్మీయముగ నీవు యెదిగెదవు
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
క్రీస్తేసు సిలువపై దృష్టినుంచి ఆయన కృపయందే Lyrics
Your favourites
- No Favourites found!
