Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
క్రీస్తు ప్రభుకే సకల మహిమ శాశ్వతంబైనది Telugu Christian Song Lyrics

క్రీస్తు ప్రభుకే సకల మహిమ శాశ్వతంబైనది Lyrics

క్రీస్తు ప్రభుకే సకల మహిమ - శాశ్వతంబైనది తన రాజ్యం
1. మర్మంబిదియే - కనుమా ప్రియుడా - ఉర్విని మానవ - సాయము లేక
పర్వతంబు నుండి - మల్చబడె నొకరాయి
2. మేలిమి వెండి - రాజ్యాలను - యిత్తడి యినుప - రాజ్యాదులను
ఈ రాయియే నలుగ - గొట్టును చెత్తవలెనే
3. ప్రియుడా వింతై - న యీ రాయి - పెరిగి భులో - కమంతాయె
ప్రభు క్రీస్తుని వింత - సార్వత్రిక సంఘమిదే
4. ఆ రాజ్యమును - చూచు భాగ్యం - ఆ రాజ్యములో - చేరెడి భాగ్యం
అనుభవింపనగును - పరిశుద్ధ ప్రజలకే
5. ఈ సుహృదయ - శుద్ధి నీకు - క్రీస్తు ప్రభువే - కలుగ చేయున్
యేసాటియులేని - ఈ శుద్ధి నొందుము
6. మనకిచ్చిన ఆ - హ్వానంబునకు - తన రాజ్యని - త్యమహిమలకు
తగినయట్టి రీతిన్ - నడుచుకోవలె ప్రియుడా


Your favourites

  • No Favourites found!