క్రీస్తు యేసు వచ్చును ఆయత్తముగ నుండుడి
అను సూచనలు చూపుచున్నవి - వేచియుండుడి ఆయనకై
1. రక్షణ సంపూర్తిచేయుటకై - అక్షయుడేసు వచ్చును
అక్షణ పొందిన వారెల్లరు - తక్షణమే ఎత్తబడెదరు
2. పరిశుద్ధులందు మహిమ నొంద - పరమ యేసు వచ్చును
పరిశుద్ధులు వింతపడునట్లు - అరయునేసు వేగమే
3. మరుగైనవి బయలు పరచ - వరుడు యేసు వచ్చును
హృదయ ఆలోచనలెల్ల - సదయుడు బయలుపరచును
4. వేయేండ్ల పాలన చేయుటకై - రయముగ యేసు వచ్చును
సర్వరాజ్యములు అన్నియు - సర్వేశుడేసుని రాజ్యమగున్
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
క్రీస్తు యేసు వచ్చును ఆయత్తముగ నుండుడిఅను Lyrics
Your favourites
- No Favourites found!
