1. క్రీస్తుని చూచుచు సాగివెళ్ళెదను - సీయోను యాత్రలో
లోకమున్ విడిచి చేరుకొందును మహిమ దేశమున్
క్రీస్తుని అనుగ్రహములో సురక్షిత హస్తములలో
మహానందముతో స్తుతించుచు చేరుదు నాదేశమున్
ఎంతో సుందర జీవితము - మహిమతో నిండినది
సదా సర్వదా క్రీస్తుతో నుండి
మహిమ పరచెదను - మహిమలో నుండెదను
2. దుఃఖ శ్రమలలో నన్ను రక్షించు దాగుచోటు ఆయనే
సంకటక్లేశ పరీక్షలలో జయము పొందెదను
ప్రభునికై జీవించెదను ఆయన అడుగు జాడలలో
ఆత్మ ప్రాణ శరీరము లర్పించి ఆయనను సేవింతును
3. యాత్రికుడను ఈ జగమందు - పరవాసినైతి నేను
స్వల్పజీవితము భువియందు గడిపి - చేరుదున్ ఆ దేశమున్
నాకై విజ్ఞాపనము చేయు - మహాయాజకుడు యేసునితో
తోడి వారసుడనై ఆయనతో - నిత్యము ఏలెదను
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
క్రీస్తుని చూచుచు సాగివెళ్ళెదను సీయోను యాత్రలోలోకమున్ Lyrics
Your favourites
- No Favourites found!
