Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కృతజ్ఞతన్ తలవంచి నాదు జీవము అర్పింతును Telugu Christian Song Lyrics

కృతజ్ఞతన్ తలవంచి నాదు జీవము అర్పింతును Lyrics

కృతజ్ఞతన్ తలవంచి - నాదు జీవము అర్పింతును
లేదే యిక నే యీవి యిల - అర్పింతును నన్నే నీకు
1. దూరమైతి నీ ప్రేమ మరచి - నే రేపితి నీ గాయముల్
దూరముగ నిక వెళ్ళజాల - కూర్చుండెద నీ చెంతనే
2. ఆకర్షంచె లేకాశలన్ని - లోక మహిమ నడ్డగించు
కోర్కెలన్ని క్రీస్తు ప్రేమకై - నిక్కముగా త్యజింతును
3. తరముల నీ ప్రేమ నాకై - వర్ణింపను అశక్యము
నిరంతరము సేవించినను - తీర్చలేను నీ ఋణము
4. లోకముకై జీవించనింక - నీ కొరకై జీవింతును
నీ కర్పింపన్ నే వెనుదీయన్ - ఈ కొద్ది నా జీవితము
5. చింతించితి గత పాపములకై - ఎంతో నేను యేడ్చుచుంటి
కృతజ్ఞతతో సమర్పింతును - బ్రతుకంతయు నీ సేవకై


Your favourites

  • No Favourites found!