Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
క్రొత్త యేడు మొదలు బెట్టెను  Telugu Christian Song Lyrics

క్రొత్త యేడు మొదలు బెట్టెను Lyrics

క్రొత్త యేడు మొదలు బెట్టెను మన బ్రతుకు నందు
క్రొత్త యేడు మొదలు బెట్టెను
క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త యేట ప్రభుని సేవ
తత్తర పడకుండ జేయు టుత్తమొత్తమంబు జూడ         ||క్రొత్త||

పొందియున్న మేలులన్నియు బొంకంబు మీర
డెందమందు స్మరణ జేయుడి
ఇందు మీరు మొదలుపెట్టు పందెమందు గెల్వ వలయు
అందముగను రవిని బోలి అలయకుండా మెలయకుండా        ||క్రొత్త||

బలము లేని వారమయ్యీను బలమొందవచ్చు
కలిమి మీర గర్త వాక్కున
అలయకుండా అడుగుచుండ నలగకుండా మోదమొంది
బలమొసంగు సర్వ విధుల నెలమి మీర నొచ్చుచుండ            ||క్రొత్త||

పాప పంకమంటినప్పుడు ప్రభు క్రీస్తు యేసు
ప్రాపు జేరి మీరు వేడగా
సేపు మీర తనదు కరుణ పాపమంతా కడిగివేసి
పాప రోగ చిహ్నలన్ని బాపి వేసి శుద్ది చేయు                       ||క్రొత్త||

Your favourites

  • No Favourites found!