Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
క్రొత్త యేడు మొదలు బెట్టెను మన Telugu Christian Song Lyrics

క్రొత్త యేడు మొదలు బెట్టెను మన Lyrics

క్రొత్త యేడు మొదలు బెట్టెను మన బ్రతుకునందుఁ క్రొత్త మనసు తోడ
మీరు క్రొత్త యేటఁ బ్రభుని నేవఁ దత్తర పడకుండఁ జేయు
టుత్తమోత్తమంబుఁ జూడఁ ||క్రొత్త||

1. పొంది యున్న మేలు లన్నియుఁ బొంకబు మీఱ డెందమందు స్మరణ
జేయుఁడీ యిందు మీరు మొదలు బెట్టు పందెమందుఁ గెల్వ వలయు
నందముగను రవినిఁబోలి నలయకుండ మెలయకుండఁ ||క్రొత్త||

2. మేలు సేయఁ దడ వొనర్పఁగా మీరెఱుఁగునట్లు కాలమంత నిరుడు
గడ చెఁగా ప్రాలుమాలి యుండకుండ జాల మేలు సేయవలయుఁ
జాల జనముల కిమ్మాను యేలు నామ ఘనతకొఱకుఁ ||క్రొత్త||

3. బలము లేని వార మయ్యును బల మొంద వచ్చుఁ గలిమి మీఱఁ గర్త
వాక్కున నలయకుండ నలగకుండ మోద మొంది బల మొసంగు సర్వవిధుల
నెలమి మీ రొనర్చుచుండఁ ||క్రొత్త||

4. ఇద్ధరిత్రి నుండు నప్పుడే యీశ్వరుని జనులు వృద్ధిబొందఁ జూడ
వలయును బుద్ధి నీతి శుద్ధులందు వృద్ధినొంద శ్రద్ధఁ జేయ శుద్ధు లైన
వారిలోఁ ప్ర సిద్ధు లగుచు వెలుఁగ వచ్చుఁ ||క్రొత్త||

5. పాపపంక మంటినప్పుడు ప్రభు క్రీస్తు యేసు ప్రాపుఁ జూరి మీరు వేఁ
డ గా నేపుమీఱఁ దనదు కరుణఁ బాప మంతఁ గడిగివేసి పాపరోగ
చిహ్న లన్ని బాపివేసి శుద్ధిఁ జేయుఁ ||క్రొత్త||

Your favourites

  • No Favourites found!