Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కృప కలిగిన వాడా నీలో నిలిచెదను దయగల Telugu Christian Song Lyrics

కృప కలిగిన వాడా నీలో నిలిచెదను దయగల Lyrics

కృప కలిగిన వాడా నీలో నిలిచెదను
దయగల యేసయ్య నీతో నడిచెదను (2)

నా జీవితకాలము పాటలు పాడెదను
నా బ్రతుకు దినమంతా ఆరాధించెద (2)
                                        || కృప కలిగిన ||
1. నా బ్రతుకు బాటను నీ వేసావే
ఆ మంచి మార్గంలో నన్ను నిలిపావు  (2)
ఆరిన నేలకు సెలయేరువు నీవు
నా దారికి రహదారివై నా ముందున్నావు (2)
పాటలు పాడెదను నా జీవితకాలము
ఆరాధించెద నా బ్రతుకు దినములు (2)
                                        || కృప కలిగిన ||
2. చేయలేనన్న సేవకు పిలిపిచ్ఛావే
ఆ పరిచర్యకు వెలిగించావు (2)
సన్నిధిలో సహవాసంలో నన్ను ఉంచావు
సంఘములో సేవకునిగా నను మార్చావు (2)
పాటలు పాడెదను నా జీవితకాలము
ఆరాధించెద నా బ్రతుకు దినములు (2)
                                        || కృప కలిగిన ||
3. పోయినన్న ప్రాణాన్ని తిరిగిచ్చావే
బ్రతకనన్న ఆశను బ్రతికించావు  (2)
నీవు ఇచ్చిన ఈ ఊపిరి నీకే అంకితము
నీవు ఇచ్చిన ఈ దేహము నీకే సొంతం అయ్యా (2)
పాటలు పాడెదను నా జీవితకాలము
ఆరాధించెద నా బ్రతుకు దినములు (2)
                                        || కృప కలిగిన ||

Your favourites

  • No Favourites found!