Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కృప కనికరముల మా దేవా కృతజ్ఞతనర్పింతు Telugu Christian Song Lyrics

కృప కనికరముల మా దేవా కృతజ్ఞతనర్పింతు Lyrics

కృప కనికరముల - మా దేవా - కృతజ్ఞతనర్పింతు
1. యెహోవా చేసిన - ఉపకారములకై ఆయన కేమి చెల్లింతును?
యెహోవా నామమున ప్రార్థన జేసెదను రక్షణ పాత్రచేబూని
2. యెహోవాకు నా - మ్రొక్కుబడి చెల్లింతు యెహోవా దాసుడను నేను
యెహోవా ప్రజలలో యెరూషలేములో ఎల్లప్పుడు స్తుతింతు
3. తల్లి గర్భమున - రూపింపబడక మునుపే నన్ను - ఎరిగితివి
తల్లి గర్భమునుండి - బయలుపడకముందే ప్రతిష్టించితివి
4. పూర్ణ మనస్సుతో - నన్ను వెదకిన నన్ను కనుగొందురంటివి
కరుణతో నీవే - నన్ను వెదకి రక్షించితివి ప్రభువా
5. దూషకుడను - హింసకుడను హానికరుడనై యుంటిని
దాసునిగా నన్ను - జేసికొంటివి దోషముల బాపి
6. ఇది నీకొరకై - విరువబడిన నా శరీరమనియంటివి
ఇది నీ పాప - క్షమకొరకై చిందిన రక్తమంటివి
7. నీదు కృపతో - నాదు యేసు నన్ను నీవు - రక్షించితివి
కాదునాదు - క్రియలవలన ఇది దేవుని వరమే
8. చెప్పనశక్యము - మహిమా యుక్తము నీవొసంగిన - సంతోషము
తప్పకుండ హల్లెలూయ పాటపాడెదన్

Your favourites

  • No Favourites found!