Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కృపా కృపా సజీవులతో నను Telugu Christian Song Lyrics

కృపా కృపా సజీవులతో నను Lyrics

కృపా కృపా సజీవులతో
నను నిలిపినది నీ కృపా (2)
నా శ్రమదినమున నాతో నిలిచి
నను ఓదార్చిన నవ్యకృప నీదు కృప (2)
కృపా సాగర మహోనాతమైన
నీ కృపా చాలుయా    || కృపా||

1. శాశ్వతమైన నీ ప్రేమతో
నను ప్రేమించిన శ్రీకరుడా
నమ్మకమైన నీ సాక్షినై నే
నీ దివ్య సన్నిధిలో నన్నొదిగిపోని (2)
నీ ఉపదేశమే నాలో ఫలబరితమై
నీ కమనియ కాంతులను విరజిమ్మెనే (2)
నీ మహిమను ప్రకటింప నను నిలిపేనే   || కృపా||

2. గాలితుఫానుల అలజడితో
గూడుచెదరిన గువ్వవలే
గమ్యమును చూపే నిను వేడుకొనగా
నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి (2)
నీ వాత్యల్యమే నవ వసంతము
నా జీవిత దినములు ఆద్యంతము (2)
ఒక్క క్షణమైన విడువని ప్రేమామృతము  ||కృపా||

3. అత్యునతమైన కృపలతో
ఆత్మఫలము సంపదలతో
అతిశ్రేష్టమైన స్వాస్త్యమును పొంది
నీ ప్రేమ రాజ్యములో హర్షించువేళ (2)
నా హృదయార్పణ నిను మురిపించని
నీ రుణాతిశయములను కీర్తించని (2)
ఈ నీరీక్షణ నాలో నేరవని   || కృపా||

Your favourites

  • No Favourites found!