Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కృపగల దేవుడవు నీ కృపలో Telugu Christian Song Lyrics

కృపగల దేవుడవు నీ కృపలో Lyrics

కృపగల దేవుడవు నీ కృపలో కాపాడావు
దయగల దేవుడవు నీ దయ నాపై చూపావు (2)
గడచినా కాలమంతా నీవిచ్చినా బహుమానమే
నేనున్నా ఈ క్షణం కేవలం నీ కృపే
యేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడైయున్నావు (2)

1. ఏ అపాయము నన్ను సమీపించక
ఏ కీడు నా దరికి చేరక (2)
ఆపదలో నుండి విడిపించావు
అనుదినము నన్ను కృపతో కాచావు (2)
యేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడైయున్నావు (2)
                                                           ||కృపగల||
2. ఇన్నినాళ్ళు నాకు తోడై
ఎన్నో మేలులతో దీవించావు (2)
విడువక యెడబాయక తోడైయున్నావు
శాశ్వత ప్రేమను నాపై చూపావు
యేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడైయున్నావు (2)
                                                           ||కృపగల||

Your favourites

  • No Favourites found!