Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కృపాతిశయముల్ ఓ నా యెహోవా నిత్యమున్ Telugu Christian Song Lyrics

కృపాతిశయముల్ ఓ నా యెహోవా నిత్యమున్ Lyrics

కృపాతిశయముల్ ఓ నా యెహోవా - నిత్యమున్ కీర్తింతును
తరతరములకు నీ విశ్వాస్యతన్ - తెలియ జేసెదను
1. యెహోవా వాక్కు దర్శనమందు - అబ్రామునకు వచ్చెను
అబ్రామా భయపడకు - 2
నీ కేడెమును - బహుమానము నేనై యున్నాననెను - 2
2. నా నిబంధనన్ ఏ నాటికిన్
రద్దుపరచనని పల్కెన్ - మార్చవు నీ మాటను
నీ పెదవులతో పల్కిన దానిని దృఢము చేతువు
3. శాశ్వతమైనదా ప్రభుత్వము - తొలగిపోదే నాటికిన్
లయము కాదు ఆ రాజ్యం
మహిమ ఘనత ఆధిపత్యమును నీవాయెన్ నిత్యము
4. నీ నిబంధనన్ దావీదుతోడని లేవీయులతో జేసితివి
ఆకాశ తారల వలెన్
సముద్ర ఇసుక రేణువులంతగ జేసెదనంటివి
5. దివారాత్రులతో నా నిబంధన
మార్చెదరా మీరు మీరునట్లు - అట్లయిన భంగమగున్
దావీదుతోనే జేసినయట్టి నిబంధనంటివి
6. సింహాసనమున దావీదు - సంతతి యుండక మానదు
లేవీయుల్ యాజకులన్
నా పరిచారకులందరిన్ ఫలింపజేసెదనంటివి
7. యెహోవా నీ కృప కార్యములన్నియు
వీనుల విందుగ నొప్పుచుండె
శ్లాఘింతున్ మనసారగన్
హల్లెలూయ - స్తోత్రములతో - కీర్తింతు నిత్యము


Your favourites

  • No Favourites found!