Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
క్షణమైన గడవదు తండ్రి నీ కృప Telugu Christian Song Lyrics

క్షణమైన గడవదు తండ్రి నీ కృప Lyrics


క్షణమైన గడవదు తండ్రి
నీ కృప లేకుండా – (2)
ఏ ప్రాణం నిలువదు ప్రభువా
నీ దయ లేకుండా – (2)
నీవే నా ప్రాణం – నీవే నా ధ్యానం
నీవే నా సర్వం – యేసు (2) ||క్షణమైన||
ఇంత కాలం లోకంలో బ్రతికా
జీవితం అంతా వ్యర్థం చేసా
తెలుసుకున్నాను నీవు లేని జీవితం వ్యర్థమని
అనుభవించాను నీ సన్నిధిలో ఆనందమని (2) ||నీవే||
పనిలో ఉన్నా ఎందరిలో ఉన్నా
ఎక్కడ ఉన్నా నేనేమై యున్నా
నీవు నా చెంత ఉంటేనే నాకు చాలయ్యా
నీ రెక్కలే నాకు ఆశ్రయం నా యేసయ్యా (2) ||నీవే||
జ్ఞానమున్నా పదవులెన్నున్నా
ధనము ఉన్నా సర్వం నాకున్నా
నీవు నాతో లేకుంటే అంతా శూన్యమేగా
పరలోక స్వాస్థ్యం ఎల్లప్పుడు శ్రేష్ఠమేగా (2) ||నీవే||

Your favourites

  • No Favourites found!