Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
క్షణమైన నీవు  Telugu Christian Song Lyrics

క్షణమైన నీవు Lyrics

క్షణమైన నీవు నను విడచి పోలేదుగా
కనురెప్ప పాటైనా నను మరచి పోలేదుగా (2)
కునుకక నిదురించక – కనుపాపలా నను కాచియుంటివి (2)       ||క్షణమైన||

పర్వతములు అన్ని తొలగిపోయినా
నాదు మెట్టలన్ని చెదరిపోయినా (2)
నా వెన్నంటి నా తట్టు నిలచి
కన్నీటినంతా తొలగించితివి (2)
నీ కృప నను విడిచిపోలేదు
నీ సన్నిధి నాకు దూరపరచలేదు (2)       ||క్షణమైన||

శోధనలు నన్ను చుట్టుముట్టినా
శ్రమలే నన్ను కృంగదీసినా (2)
నా తండ్రివై నా తోడుగా నిలచి
నా భారములన్ని తొలగించితివే (2)
నీ కృప నను విడిచిపోలేదు
నీ సన్నిధి నాకు దూరపరచలేదు (2)       ||క్షణమైన||

Your favourites

  • No Favourites found!