Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కుమారి ఆలకించు నీ వాలోచించి కుమారి Telugu Christian Song Lyrics

కుమారి ఆలకించు నీ వాలోచించి కుమారి Lyrics

కుమారి ఆలకించు - నీ వాలోచించి
కుమారి చెవియొగ్గుము
అను మరువుము నీదు స్వంత జనమును
మరువుము నీదు తండ్రి యింటిని
1. ఈ రాజు నీ ప్రభువు - నీ సొగసు గోరె ఈ రాజు నీ ప్రభువు
ఈ రాజు నీదు సౌందర్యమును గోరె - ఈ రాజునకు నమస్కరించుము
2. తూరు దేశ కుమార్తె - నైవేద్యములను తీసికొని వచ్చును
ప్రజలలో ఇశ్వర్యవంతులు - కుమారి నీ దయను వెదకెదరు
3. అంతఃపురములో నుండు రాజకుమార్తె - ఎంతో మహిమ గలది
శృంగారమైనట్టి ఆమె వస్త్రములు - బంగారుబుట్టా పనిచేసినవి
4. విచిత్ర పనిగల వస్త్రముల ధరించి - విచిత్ర పనిగల
రాజు నొద్ధకు కన్యకల వలన - రమ్యముగా కొని రాబడుచున్నది
5. ఉత్సాహ సంతోషముతో - వారు వచ్చు చున్నారు - ఉత్సాహ సంతోషముతో
రాజనగరిలో ప్రవేశించు చున్నారు - రాబడు చున్నారు కన్యలందరు
6. నీ తండ్రులకు ప్రతిగా - నీ కుమారులుందురు - నీ తండ్రులకు ప్రతిగా
ఈ ధరణి యందంతట నీవు వారిని - అధికారులనుగా నియమించెదవు
7. తరము లన్నిటను నీ - పేరు జ్ఞాపకముండు - కరణి నొనర్చెదవు
కాన జనములు సర్వకాలము కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లించెదరు


Your favourites

  • No Favourites found!