Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కుమ్మరీ ఓ కుమ్మరీ జగదుత్పత్తిదారీజిగటమన్నై నా Telugu Christian Song Lyrics

కుమ్మరీ ఓ కుమ్మరీ జగదుత్పత్తిదారీజిగటమన్నై నా Lyrics

కుమ్మరీ ఓ కుమ్మరీ జగదుత్పత్తిదారీ
జిగటమన్నై నా వంక చల్లగ చూడుమయ్యా......

1. పనికిరాని పాత్రనని పారవేయకుమా పొంగిపొరలు
పాత్రగా జేసి నన్ను నింపుమా సువార్తలోని పాత్రలన్నీ
శ్రీ యేసున్ పొగడుచుండ సాక్షిగ నుండు
పాత్రగజేసి సత్యముతో నింపుము తండ్రి ||కుమ్మరీ||

2. విలువలేని పాత్రన్ నేను కొనువారు లెరెవ్వరూ
వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగజేసి
ఆటంకములనుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా ||కుమ్మరీ||

3. లోకాశతో నింజి ఉప్పొంగుచు మార్గంబునే తప్పితిన్
మనుష్యేచ్చలన్నియున్ స్థిరమనుచు నే మనశ్శాంతి కోల్పోతిని
పోగొట్టుకొన్న పాత్రయనుచు పరుగెత్తి నను పట్టితీ
ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదంబుల్ నే పట్టితిన్ ||కుమ్మరీ||

Your favourites

  • No Favourites found!