కురిసెను ఆనందాలు
జతకలిసెను అనుబంధాలై
ఇది దేవునికార్యం శుభతరుణం (2) || కురిసెను ||
1. సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను
దేవుడే చేసేను జతపరచి దీవించెను (2)
వివాహము అన్నిటిలో ఘనమైనబంధం
నిలిచిపోవాలి ఎన్నటికి ఈ బంధం (2) || కురిసెను ||
2. యేసే మీ గృహమును కట్టెను స్థిరముగా
క్రీస్తే యజమానిగా పాలించును ప్రభువుగా (2)
ఓకరికి ఓకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో
ప్రేమా భక్తి కలిగి జీవించాలి (2) || కురిసెను ||
