Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కుతూహల మార్భాటమే నా యేసుని Telugu Christian Song Lyrics

కుతూహల మార్భాటమే నా యేసుని Lyrics

పల్లవి:
కుతూహల మార్భాటమే - నా యేసుని సన్నిధిలో

ఆనంద మానందమే - నా యేసుని సన్నిధిలో
...కుతూహల...

1.
పాపమంత పోయెను - రోగమంత తొలగెను యేసుని రక్తములో

క్రీస్తునందు జీవితం - కృప ద్వార రక్షణ పరిశుద్ధాత్మలో (2X)
...కుతూహల...

2.
దేవాది దేవుడు ప్రతిరోజు నివసించె దేవాలయం నేనే

ఆత్మలోన దేవుడు - గుర్తించె నన్ను అద్భుత మద్భుతమే (2X)
...కుతూహల...

3.
శక్తినిచ్చు యేసు - జీవమిచ్చు యేసు జయంపై జయమిచ్చును

ఏకముగా కూడి, హోసన్న పాడి - ఊరంత చాటెదము (2X)
...కుతూహల...

4.
భూరధ్వనితో పరిశుద్ధులతో - యేసు రానైయుండె

ఒక్క క్షణములోనె, రూపాంతరము పొంది - మహిమలో ప్రవేశిద్దాం (2X)
...కుతూహల...

Your favourites

  • No Favourites found!