లాలి లాలి లాలమ్మ లాలి - లాలనుచు బాడరే బాల యేసునకు || లాలి ||
1.పరలోకపు దేవ తనయుడోయమ్మా - పుడమిపై బాలుడుగ పుట్టెనోయమ్మా || లాలి ||
2.ఇహ పరాదుల కర్త యితడేనొ యమ్మా - మహిబాలనము జేయు మహితుడోయమ్మా || లాలి ||
3.ఆదియంతము లేని యనఘుడో యమ్మా - ఆదాము దోషమున కడ్డుపడె నమ్మా || లాలి ||
4.యూదులకు రాజుగా బుట్టెనోయమ్మా - యూదు లాతని తోడ వాదించిరమ్మా || లాలి ||
5.నర గొర్రెల మంద కాపరో యమ్మా - గొర్రెలకు నందంబు క్రీస్తు తానమ్మా || లాలి ||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
లాలి లాలి లాలమ్మ లాలి లాలనుచు Lyrics
Your favourites
- No Favourites found!
