Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
లెక్కలేని చుక్కలెన్నో చక్కగా వెలుగుచుండ Telugu Christian Song Lyrics

లెక్కలేని చుక్కలెన్నో చక్కగా వెలుగుచుండ Lyrics

పల్లవి:  లెక్కలేని చుక్కలెన్నో చక్కగా వెలుగుచుండ   (2X)
  చెప్పకుండ వెళ్ళిపోయె చక్కని చుక్క - దుఃఖమే విడిచిపోయె చక్కని చుక్క  (2X)

 … లెక్కలేని…

1.  ప్రభువునందు మృతులే మరి ధన్యులని - విభుని చెంత చేరుటయే గమ్యమని   (2X)
  ఆలకించెనెక్కడో చక్కని చుక్క - ఆలసింపక వెళ్ళిపోయె చక్కని చుక్క   (2X)

… లెక్కలేని…

2.  దేహమందు నివశించుట వ్యర్ధమని - మోహమంత మరచుట పరమార్ధమని   (2X)
  ఆలకించెనెక్కడో చక్కని చుక్క - ఆలసింపక వెళ్ళిపోయె చక్కని చుక్క  (2X)

… లెక్కలేని…

3.  పాపలోకమందు బ్రతుకలేమని - ఆ పరమును చే్రుటయే మేలని   (2X)
  ఆలకించెనెక్కడో చక్కని చుక్క - ఆలసింపక వెళ్ళిపోయె చక్కని చుక్క  (2X)

 … లెక్కలేని…

4.  యేసు ప్రభువు తిరిగి భువికి వచ్చునని - మృతులనుండి తనను తిరిగి లేపునని(2X)
  ఆలకించెనెక్కడో చక్కని చుక్క - ఆలసింపక వెళ్ళిపోయె చక్కని చుక్క  (2X)

 … లెక్కలేని…

Your favourites

  • No Favourites found!