Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
లెక్కింపగ తరమా నీ మేలులువివరింపగ తరమా Telugu Christian Song Lyrics

లెక్కింపగ తరమా నీ మేలులువివరింపగ తరమా Lyrics


లెక్కింపగ తరమా నీ మేలులు
వివరింపగ తరమా నీ కార్యములు (2)
నీవిచ్చిన బహుమానం బహు శ్రేష్టము
నీకిచ్చే స్తుతియాగం స్వీకరించుము (2) ||లెక్కింపగ||
నీ ప్రేమలోనే తను ఎదగాలి
నీ రక్షణలోనే కొనసాగాలి (2)
నీ సన్నిధి చేరి నీ జ్ఞానముతోని
నిరతం నిన్నే స్తుతియించాలి
తన జీవితమంతా నీ రెక్కల క్రింద
నిన్నే ఎల్లప్పుడు సేవించాలి (2) ||లెక్కింపగ||
నీ వాక్యము తన హృదిలో ఉండాలి
నీ తలంపులు మదిలో నిండాలి (2)
నీ దయయందు మనుష్యుల దయయందు
ప్రతి యేటా దీవెనలతో వర్ధిల్లాలి
నీ ఆత్మ బలముతో స్థిరమైన మనస్సుతో
ప్రతి చోట నీ సాక్షిగ జీవించాలి (2) ||లెక్కింపగ||

Your favourites

  • No Favourites found!