Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
లేలెమ్ము సోదరీ సోదరుడా రక్షకుడేసుని సేవింప Telugu Christian Song Lyrics

లేలెమ్ము సోదరీ సోదరుడా రక్షకుడేసుని సేవింప Lyrics

లేలెమ్ము సోదరీ సోదరుడా - రక్షకుడేసుని సేవింప
1. సత్యముతో ఆత్మతో దేవుని - సన్నిధి జేరి ఆరాధింప
ఆశ్చర్యకరుడు ఆలోచన - కర్త బలవంతుడు ప్రభుయేసు
2. రాజాధిరాజు మన ప్రభుయేసు - రాజ్యము నీయ మనకై వచ్చున్
రాజైన యేసు విజయము కల్గి - విజయుండు యేసుని చాటెదము
3. షద్రకు మేషాక బెద్నాగో - పౌరుషముతోడ ప్రభుశ్రమ నోర్చె
కరువైనను మీకు శ్రమలైన - కరుణించుచు ప్రభు మీతో నడుచున్
4. స్తెఫెనాది అపొస్తలులంత - అపవిత్రమైన ప్రజలమధ్య
కృపాళుదైన యేసుని చాటె - కృపనొందుచు ప్రభుని చాటండి
5. అర్పించుడి మీదు హృదయములన్ - నెరవేర్చను దేవుని చిత్తమును
కర్తను సేవింపగను లెండి - వీరులుగా దావీదు వలెను
6. యౌవనేచ్ఛలను విసర్జించి - యౌవన రక్తముతో మిము గొన్న
పావనుడగు యేసు ప్రభువునకై - చావను వెనుదీయక రారండి
7. జీవించువాడనే కానంచు - జీవించుట ప్రభు కొరకే యంచు
గావించుము ప్రభు పనులిలలోన - జీవించు ప్రభు కొరకే యిలలో


Your favourites

  • No Favourites found!