Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రె Telugu Christian Song Lyrics

లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రె Lyrics

లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రె పిల్ల -2
నీ రక్తమే పాప పరిహారం నీ దేహమె జీవాహారం నీ వాక్యమే మాకు ఆధారం
నీ నామమే రక్షణకు మూలం నీ విజయమే మాకు ...... విజయం
లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రె పిల్ల

1. మొదటి ఆదాముతో పాపం జనియించెను - మరణము సంక్రమించెను -2
ఆ పాపం పోవాలంటే ఈ మరణం తొలగాలంటే మా వల్ల కానే కాదు పరిశుద్ధుడె రావాలి ....
ప్రభువా కడపటి ఆదామైనావు - కలువరి బలి పీఠము నెక్కావు
నీ ప్రాణమే బలిగా అర్పించి
మా ప్రాణాలను కాపాడావు- మరణాన్నే మ్రింగి వేసావు

నీ రక్తమే పాప పరిహారం నీ దేహమె జీవాహారం నీ వాక్యమే మాకు ఆధారం
నీ నామమే రక్షణకు మూలం నీ విజయమే మాకు ...... విజయం

లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రె పిల్ల
2. నీవు పొందిన దెబ్బలచే - మాకు స్వస్థత నిచ్చావే మా కోసం చీల్చబడినావే -2
సూరూపమేమి లేక కురూపివైనావయ్యా - నిను నలుగగొట్టుటకు తండ్రిష్టమాయేనా .....
ప్రభువా నిశ్చయముగ మా రోగాలు - భరియించావు నీ దేహములో
మా వ్యసనములన్నిటి సహియించి
మా శాపగ్రాహి వైనావు - ఆరోగ్యము మాకు ఇచ్చావు

నీ రక్తమే పాప పరిహారం నీ దేహమె జీవాహారం నీ వాక్యమే మాకు ఆధారం
నీ నామమే రక్షణకు మూలం నీ విజయమే మాకు ...... విజయం

లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రె పిల్ల
3. శ్రీమంతుడవు నువ్వు సృష్టంతటిలో నువ్వు ఐనా తగ్గించుకున్నావూ -2
నీవు సృష్టించిన ఈ భువికి దీనుడవై దిగి వచ్చావె
మము ధనవంతులుగా చేయ దారిద్ర్యత నొందావే.....
ప్రభువా నీ తగ్గింపుకు సమమేది - నీ అద్భుత కృపకు మితి ఏది
నీ ప్రేమకు ఇలలో సాటేది
నీవంటి రక్షకుడు ఏడి -నీలాంటి ప్రేమ ఘనుడేడి

నీ రక్తమే పాప పరిహారం నీ దేహమె జీవాహారం నీ వాక్యమే మాకు ఆధారం
నీ నామమే రక్షణకు మూలం నీ విజయమే మాకు ...... విజయం

లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రె పిల్ల

Your favourites

  • No Favourites found!