Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
లోకం, జీవం, మరణంబైనన్ సకలము మీవె Telugu Christian Song Lyrics

లోకం, జీవం, మరణంబైనన్ సకలము మీవె Lyrics

లోకం, జీవం, మరణంబైనన్
సకలము మీవె నిజం - స్థిరముగ నమ్ముడిలన్
1. ప్రస్తుతమందు ఉన్నవియైనన్ - రాబోవునట్టివియైనను
వాస్తవముగా సమస్తము మీవె - మీరేసుని వారు
2. తన్ను ప్రేమించుచుండెడి వారికి - దేవుడు వేటిని సిద్దపరచెనో
కన్నులకు గోచరము కావవి - చెవులకు వినబడవు
3. హృదయములకు అగోచరమైనవి - మరుగైయుండె లోకజ్ఞానులకు
పదిలముగా ప్రభు సహాయముతో - నేరుగు మీ మర్మమును
4. అక్షయమైనది నిర్మలమైనది - వాడబారనిది మీ స్వాస్థ్యము
రక్షకుడేసు భద్రపరచెను - పరమున మీకొరకు
5. అసమానమగు శక్తిచే మిమ్మున్ - నిత్యముకాచి భద్రపరచును
యేసు ఆ కడవరి రక్షణ మీకు - నిచ్చు విశ్వసించు
6. మీరే దేవుని పుత్రులటంచు - ఆత్మయే సాక్షమిచ్చు చున్నాడు
వారసులగు మీరు శ్రమపడిన - మహిమను పొందెదరు
7. జయించువాడు వీటన్నిటిని - స్వాతంత్రించుకొను నిక్కముగా
ఆయనే మీకు దేవుడైయుండు - మీరాయన సుతులు


Your favourites

  • No Favourites found!