లోకమంతట వెలుగు ప్రకాశించెను యేసు జన్మించినపుడు
ఆకాశమునందు గొప్ప నక్షత్రంబు బుట్టెనపుడు లోకజ్ఞానులు గొల్లలు వెళ్లి
లోక రక్షకుడేసుకు మ్రొక్కిరి ||లో||
1. నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను చీకటి దాని గ్రహింప లేదు
నేను లోకమునకు వెలుగై యున్నాను నను వెంబడించు వాడు చీకటిలో
నడువక జీవపువెలుగై యుండుడనె యేసు ||లో||
2. ఆ పట్టణములో వెలుగుటకు సూర్యుడైనను చంద్రుడైన నక్కరలేదు ఆ
పట్టణములో దేవుని మహిమయే ప్రకాశించుచున్నది యెపుడు ఆ
పట్టణమునకు దేవుని గొఱ్ఱెపిల్లయే దీపమై వెలుగుచుండు ||లో||
3. మీరు లోకమునకు వెలుగై యున్నారు గనుక మీరు వెలుగు సంబంధులు
మీరు కొండపైన కట్టబడిన పట్టణంబువలెనే మరుగై యుండక నరులందరికి
వెలుగై యుందురనె యేసుండు ||లో||
4. చీకటిలో నడుచుజనులు గొప్ప వెలుగును చూచిరి ధన్యులై లోక
మందు మరణచ్ఛాయగల దేశనివాసుల మీద ప్రకాశించెను గొప్ప వెలుగును
ప్రభువు యేసుకు జేయని పాడరే ||లో||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
లోకమంతట వెలుగు ప్రకాశించెను యేసు జన్మించినపుడుఆకాశమునందు Lyrics
Your favourites
- No Favourites found!
