Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
లోకమును విడచి వెళ్ళవలెనుగా సర్వమిచ్చటనే Telugu Christian Song Lyrics

లోకమును విడచి వెళ్ళవలెనుగా సర్వమిచ్చటనే Lyrics


లోకమును విడచి వెళ్ళవలెనుగా (2)
సర్వమిచ్చటనే విడువవలెన్ – విడువవలెన్     ||లోకమును||

యాత్రికులము ఈ దుష్ట లోకములో
పాడు లోకములో మనకేది లేదు (2)
ఏ విషయమందైన గర్వించలేము (2) గర్వించలేము
జాగ్రత్తగానే నడచుకొనెదము (2)      ||లోకమును||

మన ఈర్ష్య కపటా ద్వేషాలు విడచి
నిజ ప్రేమతోనే జీవించెదాము (2)
నిష్కళంకులమై శుద్ధులమై (2) శుద్ధులమై
పరిపూర్ణతను చేపట్టుదాము (2)      ||లోకమును||

ఆత్మీయ నేత్రాలతో చూచెదాము
ఎంతా అద్భుతమో సౌందర్య నగరం (2)
ప్రభువు చెంతకు వెళ్ళెదము (2) వెళ్ళెదము
విజయోత్సవముతో ప్రవేశించెదము (2)      ||లోకమును||

Your favourites

  • No Favourites found!