Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మా ఊహలు పుట్టక మునుపే Telugu Christian Song Lyrics

మా ఊహలు పుట్టక మునుపే Lyrics

పల్లవి:
మా ఊహలు పుట్టక మునుపే - మా సర్వమునెరిగిన దేవ (2x)

ఇహపరములలో నీవే - మా కోర్కెలు తీర్చెడి ప్రభువా (2x)

ఆ.ప.
విశ్వాస నిరీక్షణతో - కనిపెట్టియున్నచో (2x)

పొందెదమెన్నో మేలులూ - ప్రభువా నీ పాద సన్నిధిలో (2x)

1.
నిన్నడుగకుండగనే - మోషేను పిలచితివి

నిన్నడిగిన సొలోమోనుకు - జ్ఞాన సిరుల నొసగిన దేవా

పలు సమయాల యందు - పలు వరముల నిచ్చితివే

అడుగనేల ప్రభువా - ఈ ధరలో - నీ దివ్య కృపయే చాలు
...మా ఊహలు...

2.
ప్రార్ధించుచుంటిమి - సమస్యలు తీర్చుమని

నిన్నడిగుచున్నాము - నీ రాజ్యములొ చోటిమ్మని

ఊహించు వాటికంటె - అధికముగా నిచ్చెడి దేవ

ఇంతకంటె మాకేమి వలదు - నీ తోడు నీడె చాలు
...మా ఊహలు...

Your favourites

  • No Favourites found!