మా యేసు క్రీస్తు నీవే మహిమగల రాజవు నీవు
నీవే తండ్రికి నిత్యకుమారుడవు ఓ క్రీస్తూ||
1.
భూనరులన్ రక్షింపఁ బూనుకొనినప్పుడు
దీన కన్యాగర్భమున్ దిరస్కరింపలేదుగా ఓ క్రీస్తూ||
2.
విజయము మరణపు వేదనపై నొందఁగా
విశ్వాసులందరికిన్ విప్పితివి మోక్షమున్ ఓ క్రీస్తూ||
3.
నీవు తండ్రిదైనట్టి నిత్య మహిమయందు
దేవుని కుడివైపుఁ దిరముగాఁ గూర్చున్నావు ఓ క్రీస్తూ||
4.
నీవు న్యాయాధిపతివై నిశ్చయముగా వఛ్ఛెదవు
కావున నీ సాయంబుకానిమ్ము నీ దాసులకు ఓ క్రీస్తూ||
5.
దివ్యమౌ రక్తంబు చిందించి నీవు రక్షించిన
సేవకులకై మేముచేయు మనవి నాలించు ఓ క్రీస్తూ||
6.
నీ వారి నెల్లప్పుడును నిత్య మహిమయందు
నీ పరిశుద్ధులతోను నీ వెంచుకొను మయ్య ఓ క్రీస్తూ||
7.
నీదు జనమున్ రక్షించి నీ దాయము దీవించుము
నాధా వారలను నేలి లేవనెత్తు మెప్పుడును ఓ క్రీస్తూ|
8.
దిన దినమును నిన్ను మహిమ పర్చుచున్నాము
ఘనముగా నీ నామమున్ గొప్పచేయుచున్నాము ఓ క్రీస్తూ||
9.
నేఁడు పాపము చేయకుండ నెనరుతో మముఁ గావుమయ్యా
పాడెడి నీ దాసులకుఁ బరమ దయ నిమ్మయ్య ఓ క్రీస్తూ||
10.
ప్రభువా కరుణించుము ప్రభువా కరుణించుము
ప్రార్థించు నీ దాసులపై వ్రాలనిమ్ము దీవెనలన్ ఓ క్రీస్తూ||
11.
నిన్ను నమ్మి యున్నాము నీ కృప మాపైఁ జూపుము
మేము మోసపోకుండ నీవే కాపాడుమయ్యా ఓ క్రీస్తూ||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
మా యేసు క్రీస్తు నీవే మహిమగల Lyrics
Your favourites
- No Favourites found!
