మా యేసు క్రీస్తుని మఱుఁగు గల్గెనురా నా యాత్మ ఘనరక్షా
నగమ నెక్కెను రా ||మా యేసు||
1. ముందు నాలో పాప ములు జూడఁ బడెరా డెందము తా నన్ని టిని
నొప్పుకొనెరా యందుకై బలు దుఃఖ మాత్మఁ జెందెనురా సందేహములు
వీడు జాడఁ గన్గొనెరా ||మా యేసు||
2. సువిశేష బోధనా చెవు లాలించెనురా అవివేక శాస్త్రోక్తు లంటు
వీడెనురా నవసత్క్రైస్తవ గోష్ఠి భువి నా కబ్బెనురా వివిధము లగు
వేల్పు ల్విష మైరిగదా ||మా యేసు||
3. బాధగురువుల మోము ల్బహు లజ్జఁబడెరా గాధ మంత్రము లన్ని
కడగండ్లయి చెడెరా శోధించి నాయాత్మ శుద్ధిగోరెనురా సాధించి
ప్రభుక్రీస్తు శరణుఁ జొచ్చెనురా ||మా యేసు||
4. మతిలోని లోఁతు మ ర్మము గానఁబడెరా మితలేని ఘనపాప మే
నిండు కొనెరా హితముగా తన జీవ మిచ్చె క్రీస్తుఁడురా మృతిచేత మన
పాప వితతి గొట్టెనురా ||మా యేసు||
5. కులగోత్రముల బుద్ధి కుటిలంబుఁ దెగెరా బలవత్పిశాచ శృం ఖలము
విఱిగెనురా సిలువ మోసినవాని చిర సౌఖ్యోన్నతిరా నెలవుగ నాలోన
నిలచి యున్నదిరా ||మా యేసు||
6. తనపోల్కె నొరులఁ గ న్గొనఁ బ్రేమయ్యెనురా మనసు దేవునికి న
ర్పణ సేయఁ బడెరా ఘన కృపశాంతులు గొనెను నెమ్మదిరా మనసు
మార్పడి మోక్ష మహిమ గన్గొనెరా ||మా యేసు||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
మా యేసు క్రీస్తుని మఱుఁగు గల్గెనురా Lyrics
Your favourites
- No Favourites found!
