Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మానసవీణను శృతిచేసి మనసు నిండా కృతజ్ఞత Telugu Christian Song Lyrics

మానసవీణను శృతిచేసి మనసు నిండా కృతజ్ఞత Lyrics

మానసవీణను శృతిచేసి
మనసు నిండా కృతజ్ఞత నింపి
గొంతెత్తి స్తుతిగీతములే పాడవా
వింతైన దేవుని ప్రేమను నీవిల చాటవా
1.వేకువనే పక్షులు లేచి స్తుతి కేకలు వేయవా
సాయంసమయాన పిచ్చుకలు దేవుని కీర్తించవా
స్తుతి చేయుట క్షేమకరం - ఘనపరచుట మేలుకరం
దేవుని ఉపకారములకై సదా కీర్తించుట ధన్యకరం
2.శ్రమలతో తడబడితే ప్రార్ధనతో సరిచేయి
దిగులుతో శృతి తగ్గితే నమ్మికతో సాగనీయి
మనమే జగతికి వెలుగిస్తే - విశ్వాసగళాలు కలిస్తే
స్తుతిధూపం పైపైకెగసి దీవెనలే వర్షింపవా

Your favourites

  • No Favourites found!