మానవ రూపమును ధరించి - అరుదెంచె యేసు ఇహమునకు
ఈ పాప లోకమునకు రక్షకుండు ఆయనే
1. కౄర సిల్వనెక్కి తానే యోర్చె దుఃఖబాధలన్
శరీరమంతటినుండి కార్చెనమూల్య రక్తమున్
వేరే దిక్కిక లేదుగా ప్రియులారా చూడండి సిల్వన్
ఈ పాప లోకమునకు రక్షకుండు ఆయనే
2. చేసెను వెల్లడి పరమ తండ్రి గొప్ప ప్రేమన్ మనకై
యేసు ప్రాణమిచ్చెను నీచులైన పాపులకై
యేసును స్వీకరించుము నీ స్వంత రక్షకునిగా
ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే
3. సణుగుచును శాంతిలేక పాపభారము క్రిందను
కన్నీటిని విడుచుచును దూరముగా నీవుందువా?
నిన్ను యేసు నేడే పిలిచెన్ ఆయన యొద్దకురా
ఈ పాప లోకమునకు రక్షకుండు ఆయనే
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
మానవ రూపమును ధరించి అరుదెంచె యేసు Lyrics
Your favourites
- No Favourites found!
