మానవుఁడవై సకల నరుల మానక నా దోషములఁ బాపుటకు బలి
యైతివే యేసూ బహు ప్రేమతోడ ||మానవుఁడవై||
1. నీదు బలిని నిత్యముగను నిజముగా ధ్యానించి ప్రేమను నీదు దివ్య
ప్రేమ నొందుటకు నియమంబు నిచ్చి ||మానవుఁడవై||
2. నీవె జీవపు రొట్టె వంటివి నీవె జీవ జలంబు వంటివి నిన్ను ననుభ
వించుఁడంటివిగా నిజదేవా యేసూ ||మానవుఁడవై||
3. నీ శరీరము రొట్టెవలెనే నిజముగా విరువంగఁబడెనే నిన్నుఁ దిను
భాగ్యంబు నిచ్చితివే నా యన్న యేసూ ||మానవుఁడవై||
4. మంచి యూట మించి దండి పంచగాయములలో నుండి నిత్యజీవపు
టూటలు జేసితి నీ ప్రేమ నుండి ||మానవుఁడవై||
5. నిన్ను జ్ఞాపక ముంచుకొనుటకు నీదు ప్రేమ బలిలో మనుటకు నిత్య
మాచరించుఁడంటివి నీ నిజభక్తితోడ ||మానవుఁడవై||
6. ఎంతో ప్రేమతో బలిగా నైతివి యెంతో ప్రేమాచారమైతివి చింతలును
నా పాపములు బాప శ్రీ యేసు దేవా ||మానవుఁడవై||
7. నిత్యబలి యగు నిన్నే నమ్మి నిన్ను ననుభవించి నెమ్మి నిన్ను
నిముడించుకొని నాలో నీ నిజరూప మొంద ||మానవుఁడవై||
8. నేను నీ బలిలోనఁ గలిసి నేను నీతోఁ గలిసి మెలిసి నేను నీవలె
నుండఁ జేసితివే నా దివ్య యేసూ ||మానవుఁడవై||
9. నీదు శ్రమలను బలిని నిపుడు నాదు కనులు చూడ నెపుడు నాదు
పాపభారములు దిగునే నా దివ్య యేసూ ||మానవుఁడవై||
10. నీవు బలియై తిరిగి లేచి నిత్య తేజోరూపు దాల్చి నిత్యమును నా బంతి
నున్నావే నిజ దేవా యేసూ ||మానవుఁడవై||
11. నీవే నీ చేతులతో నిత్తువు ఈ నీ బలివిందునకు వత్తువు నిన్ను నిట
జూచితిని నా యేసూ! యెన్నఁడును మరవను ||మానవుఁడవై||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
మానవుఁడవై సకల నరుల మానక నా Lyrics
Your favourites
- No Favourites found!
