Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మానవుల మేలు కొరకు జ్ఞానియైన దేవుఁడు Telugu Christian Song Lyrics

మానవుల మేలు కొరకు జ్ఞానియైన దేవుఁడు Lyrics

మానవుల మేలు కొరకు జ్ఞానియైన దేవుఁడు మానుగఁ కల్యాణ పద్ధతి
మహిని నిర్ణయించెగా ||మానవుల||

1. కానాయను నూరిలో మన కర్త చూచెఁ బెండ్లిని పానముగను ద్రాక్షరసము
దాన మొసఁగెఁ బ్రీతిని ||మానవుల||

2. యేసూ వీరిద్దరిని ఏకముగాఁ జేయుమీ దాసులుగను జేసి వీరి దోసము
లెడబాపుమీ ||మానవుల||

3. కర్త వీరలకు భార్య భర్తల ప్రేమంబును బూర్తిగ నీ విచ్చి వీరిఁ బొందుగాను
నడుపుమీ ||మానవుల||

4. భక్తియు విశ్వాస ప్రేమలు భావమందు వ్రాయుమీ ముక్తి సరణి వెదక
వీరి భక్తి మిగులఁ జేయుఁమీ ||మానవుల||

Your favourites

  • No Favourites found!