Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మారదయా నీ ప్రేమమార్పు రాదయా నీ Telugu Christian Song Lyrics

మారదయా నీ ప్రేమమార్పు రాదయా నీ Lyrics

మారదయా నీ ప్రేమ
మార్పు రాదయా నీ ప్రేమలో (2)
ఎన్ని మారినా మారని ప్రేమ (2)
యేసయ్యా నాపై నీవు చూపుచుంటివా (2) ||మారదయా||
నిరీక్షించుచుంటిని నీ రాకకై
వేగిరమే రమ్ము నను కొనిపోవుటకు (2)
అప్పటి వరకు మారదు
నాపై నీ ప్రేమ మారనే మారదు (2) ||మారదయా||
(నాకు) ఆకాశమందు నీవు తప్ప లేరెవరు
నా శ్రమలలో నాకు నీవే జవాబు (2)
అప్పటి వరకు మారదు
నాపై నీ ప్రేమ మారనే మారదు (2) ||మారదయా||
నీ మాటలయందే ఆశ యేసయ్యా
వాగ్ధానములు నాలో నెరవేర్చుమా (2)
అప్పటి వరకు మారదు
నాపై నీ ప్రేమ మారనే మారదు (2) ||మారదయా||

Your favourites

  • No Favourites found!