Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మార్గములను సృజించువాడు  జీవితాలను వెలిగించువాడు Telugu Christian Song Lyrics

మార్గములను సృజించువాడు జీవితాలను వెలిగించువాడు Lyrics

మార్గములను సృజించువాడు – జీవితాలను వెలిగించువాడు
బ్రతుకు నావ నడిపించువాడు – యెహోవాయే నాకుండగా (2)
నేను సాధించలేనిది లేనే లేదు – జయించలేనిది లేనే లేదు
అసాధ్యమైనది లేనే లేదు – విజయమెప్పుడూ నాదే (2)
ఎన్ని ఇక్కట్లు నాకెదురైననూ
జలములు నాపైకి లేచిననూ (2)
సంకెళ్లు నను బిగదీసిననూ
శత్రు గోడలు అడ్డుగా నిలచిననూ (2) ||నేను||
జీవితమంతా శూన్యమైననూ
బంధువులందరు నను విడచిననూ (2)
వ్యాధులెన్నో నను చుట్టిననూ
అడ్డంకులెన్నో నాకెదురైననూ (2) ||నేను||

Your favourites

  • No Favourites found!