Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మార్పుచెందవా నీవు మర్పుచెందవా నీ బ్రతుకు Telugu Christian Song Lyrics

మార్పుచెందవా నీవు మర్పుచెందవా నీ బ్రతుకు Lyrics


మార్పుచెందవా నీవు మర్పుచెందవా
నీ బ్రతుకు మార్చుకోవా (2)
అనుకూల సమయం ఇదియేనని ఎరిగి
మారు మనసునూ పొందవా (2)

ఎన్నాళ్ళు నీవు జీవించినాగాని
ఏమున్నది ఈ లోకంలో
ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి
తీర్పున్నది పై లోకంలో (2)
తీర్పు దినమునందున ఆయన ముందు నీవు
నిలిచే ధైర్యం నీకుందా (2)
నిలిచే ధైర్యం నీకుందా ||మార్పుచెందవా||

దిగంబరిగానే వచ్చావు నీవు
దిగంబరిగా పోతావు
మన్నైన నీవు మన్నై పోతావు
ఏదో ఒక దినమందున (2)
నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు
నీవెంట రావెన్నడు (2)
నీవెంట రావెన్నడు ||మార్పుచెందవా||

ఆత్మని కాక దేహాన్ని చంపే
మనుషులకే భయపడకయ్యా
ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే
దేవునికే భయపడవయ్యా (2)
దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకే చేరు
నీకంటూ ఏముందిలే (2)
నీకంటూ ఏముందిలే ||మార్పుచెందవా||

Your favourites

  • No Favourites found!