Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మాట్లాడే యేసయ్యా నాతో మాట్లాడుచున్నాడు (నన్ను) Telugu Christian Song Lyrics

మాట్లాడే యేసయ్యా నాతో మాట్లాడుచున్నాడు (నన్ను) Lyrics

మాట్లాడే యేసయ్యా
నాతో మాట్లాడుచున్నాడు (2)
(నన్ను) మోకాళ్ళ పైన ఆడించుచూ (2)
చంటి బిడ్డలాగ కాయుచున్నాడు (4) ||మాట్లాడే||
వెన్నలాంటి కన్నులలో
కురిసే తన ప్రేమను పంచాలని (3)
వేకువనే తట్టుచున్నాడు
కునుకని నిద్రపోని నా యేసయ్యా (2)
తల్లిదండ్రి కన్న మిన్న అయిన దేవుడు
లోకాన నా యేసుకు సాటి లేరెవ్వరు (2) ||మాట్లాడే||
అరుణోదయమున నేను లేచి
కృతజ్ఞతా స్తుతులను చెల్లించెదను (3)
ఉత్సాహగానముతో యేసయ్యను
సంగీత స్వరములతో ఘనపరచెదను (2)
ప్రతి క్షణము నన్ను నడిపించే దేవుడు
ప్రతి ఉదయం తన కృపతో నింపే నా దేవుడు (2) ||మాట్లాడే||
లోకము నుండి నన్ను ప్రత్యేకించి
మైమరిపించాడు మహనీయుడు (3)
ఉపదేశముతో నన్ను నడుపుచున్నాడు
జీవముగల సంఘములో నిలిపియున్నాడు (2)
తన మాటతో నన్ను బలపరచాడు
కృప వెంబడి కృపతో నను నింపుచున్నాడు (2) ||మాట్లాడే||

Your favourites

  • No Favourites found!