Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మధురం మధురం – నీ ప్రేమే Telugu Christian Song Lyrics

మధురం మధురం – నీ ప్రేమే Lyrics


మధురం మధురం – నీ ప్రేమే అతి మధురం
అమరం అతి విజయం – నీ సిలువ రక్తమే విజయం
ఇమ్మానుయేలుడ నీ ప్రేమ మధురం – నీకే నా వందనం (2)
మధురం మధురం – నీ ప్రేమే అతి మధురం (2)        ||మధురం||

నా శిక్షకై నా నిందలకై – ప్రాణము పెట్టిన ప్రేమ
నిందలు నిట్టూర్పులు – సేదదీర్చిన ప్రేమ (2)
సర్వోన్నతుడా సహాయకుడా
మరువగలనా నీ ప్రేమను (2)        ||మధురం||

సత్యమును నాకు కేడెమును – ధరియింప చేసిన ప్రేమ
కనికరమును కలిగించగను – కల్వరికేగిన ప్రేమ (2)
మహోన్నతుడా మహా ఘనుడా
మరువగలనా నీ ప్రేమను (2)        ||మధురం||

Your favourites

  • No Favourites found!