మధురమైనది నా యేసు ప్రేమ
మరపురానిది నా తండ్రి ప్రేమ
మరువలేనిది నా యేసుని ప్రేమ
మధురాతిమధురం నా ప్రియుని ప్రేమ
ప్రేమ. . ప్రేమ. . నా యేసు ప్రేమ
1. ఇహలోక ఆశలతో అంధులమైతిమి
నీ సన్నిధి విడచి నీకు దూరమైతిమి
చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి
నీ సన్నిధిలో నిలపిన నీ ప్రేమ మధురం
2. నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి
మార్గములుచూపి మన్నించితివి
మరణపు ఛాయలే దరి చేరనీయక
నీలో నను నిల్పిన నీ ప్రేమ మధురం
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది Lyrics
Your favourites
- No Favourites found!
