Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మద్యపాన ప్రియులు గాకుండి ప్రియులార మీరా Telugu Christian Song Lyrics

మద్యపాన ప్రియులు గాకుండి ప్రియులార మీరా Lyrics

మద్యపాన ప్రియులు గాకుండి ప్రియులార మీరా మత్తులోనే మునిఁగి
పోకుండి మద్యపానము చేయువారికిఁ దథ్యముగఁ బ్రాప్తించుఁ గీడులు
కొద్దియైనన్ రుచిని జూడఁగఁ గోరఁ దగ దని తలఁచుకొనుఁడి ||మద్య||

1. రక్త మంతయుఁ జెడును సుమ్మండి ప్రియులారా మీరు శక్తిహీనులగుదు
రిల నుండి శక్యిహీనులె గాక మఱి మీ భక్తి దొలఁగి పోవునండి
ముక్తిమార్గము దెలియదండి ముందు గతికి హీనమండి ||మద్య||

2. బుద్ధిబలములు కొద్ది వౌనండి ప్రియులారా మీరు మొద్దు లగుదురనియు
నమ్ముండి హద్దు మిరుచుఁ ద్రాగువారికిఁ గొద్దికాలమె జీవమండి
శ్రద్ధగల్గి మద్యపానము రద్దు చేయుట తగినదండి ||మద్య||

3. మచ్చునకును త్రాగఁబోకుండి ప్రియులార మీరీ తుచ్ఛమైన పనులు
వీడుండీ హెచ్చుగాఁ దిని త్రాగువారికి వచ్చు రోగము కుదురదండి
చచ్చుటకు నిది హేతువని మదిఁ గచ్చితముగను దెలిసికొనుఁడి ||మద్య||

4. ఆలుబిడ్డల మేలుఁగోరుండి ప్రియులారా వారి మేలుఁ గోరినఁ ద్రాగంఁ
బోకుండి మేలు లెఱింగి పిలుచు క్రీస్తుని జాలిచూపులు దెలిసికొనుఁడి
కాలయాపనఁ జేయకుండి కర్త యేసని నమ్ముకొనఁడి ||మద్య||

5. ఘన ధనములు నిలువఁబోవండి ప్రియులార నీచ తనము మీకు
మూల మౌనండి తనవిఁదీర్చుదు మద్యమండి ఘనుల కొంపలు గూల్చు
నండి ఘనముగాఁ బ్రభువాక్యసారము వినయమతితో ఁ గ్రోలరండి ||మద్య||

Your favourites

  • No Favourites found!