Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మహా వైద్యుండు వచ్చెనుప్రజాళిఁ బ్రోచు యేసుసహాయ Telugu Christian Song Lyrics

మహా వైద్యుండు వచ్చెనుప్రజాళిఁ బ్రోచు యేసుసహాయ Lyrics


1. మహా వైద్యుండు వచ్చెను
ప్రజాళిఁ బ్రోచు యేసు
సహాయ మియ్య వచ్చెను
సంధింపరండి యేసున్
|| మాధుర్యంపు నామము
మోద మిచ్చు గానము
వేద వాక్యసారము
యేసు దివ్య యేసు ||

2. మీ పాప మెల్లఁ బోయెను
మేలొందుఁ డేసు పేరన్
గృపా సంపూర్ణ మొందుఁడి
యపార శాంతుఁ డేసు.

3. వినుండి గొఱ్ఱె పిల్లను
విశ్వాస ముంచి యేసున్
ఘనంబుగన్ స్తుతించుఁడి
మనం బుప్పొంగ యేసున్

4. ఆ రమ్యమైన నామము
అణంచు నెల్ల భీతిన్
శరణ్యు లైన వారి నా
దరించు నెంతో ప్రీతిన్

5. ఓ యన్నలారా పాడుఁడీ
యౌదార్యతన్ సర్వేశున్
ఓ యమ్మలారా మ్రొక్కుఁడీ
ప్రియాతి ప్రియుఁడేసు

6. ఓ పిల్లలారా కొల్వుఁడీ
యౌన్నత్య రాజు నేనున్
తపించువారి దాతయౌ
దయామయున్ శ్రీ యేసున్

7. శ్రీ యేసుకై యర్పించుఁడీ
మీ యావజ్జీవనమును
ప్రియంపు దాసులౌచును
రయంబు గొల్వుఁడేసున్

Your favourites

  • No Favourites found!