1. మహాత్ముడైన నా ప్రభు - విచిత్ర సిల్వజూడ నా
ఆస్తిన్ నష్టంబుగా నెంచి - గర్వంబణంగ ద్రొక్కుదున్
2. నీ సిల్వగాక యోదేవా - దేనిన్ బ్రేమింపనీయకు
నన్నావరించు సర్వమున్ - నీ సిల్వకై త్యజింతును
3. శిరంబు పాదహస్తమున్ - సూచించి దుఃఖ ప్రేమలు
మరెన్నడైన గూడెనా - విషాద ప్రేమలీగతిన్
4. ముండ్లన్ దుర్మార్గులల్లిన - కిరీట మేసు కుండినన్
ఈ భూకిరీటములన్ని - దానిన్ దూరంగ జాలునే
5. లోకంబు నే నర్పించినన్ - అయోగ్యమైన యీవియౌ
వింతైన యేసు ప్రేమకై - నా యావజ్జీవమిత్తును
6. రక్షింపబడ్డ లోకమా - రక్షింప చావు పొందిన
రక్షకుడేసును సదా - రావంబు తోడ గొల్వుమా
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
మహాత్ముడైన నా ప్రభు విచిత్ర సిల్వజూడ Lyrics
Your favourites
- No Favourites found!
