Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మహాఘనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు Telugu Christian Song Lyrics

మహాఘనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు Lyrics


మహాఘనుడవు మహోన్నతుడవు
పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు (2)
కృపా సత్య సంపూర్ణమై
మా మధ్యలో నివసించుట న్యాయమా
నను పరిశుద్ధపరచుటే నీ ధర్మమా (2)
వినయముగల వారిని
తగిన సమయములో హెచ్చించువాడవని (2)
నీవు వాడు పాత్రనై నేనుండుటకై
నిలిచియుందును పవిత్రతతో (2)
హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2) ||మహా||
దీన మనస్సు గలవారికే
సమృద్ధిగా కృపను దయచేయువాడవని (2)
నీ సముఖములో సజీవ సాక్షినై
కాపాడుకొందును మెళకువతో (2)
హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2) ||మహా||
శోధింపబడు వారికి
మార్గము చూపించి తప్పించువాడవని (2)
నా సిలువ మోయుచు నీ సిలువ నీడను
విశ్రమింతును అంతము వరకు (2)
హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2) ||మహా||

Your favourites

  • No Favourites found!