1. మహావైద్యుండు వచ్చెను - బ్రజాళి బ్రోచు యేసు
సహాయ మియ్యవచ్చెను - సంధింపరండి యేసున్
మాధుర్యంపు నామము - మోదమిచ్చుగానము
వేదవాక్య సారము - యేసు దివ్యయేసు
2. మీపాపమెల్ల బోయెను - మేలొందు డేసు పేరన్
గృపా సంపూర్ణ మొందుడి - యపార శాంతుడేసు
3. వినుండి గొర్రెపిల్లను - విశ్వాసముంచి యేసున్
ఘనంబుగన్ స్తుతించుడి - మనంబుప్పొంగ యేసున్
4. ఆ రమ్యమైన నామము - అణంచు నెల్ల భీతిన్
శరణ్యులైనవారి నా - దరించు నెంత ప్రీతిన్
5. ఓ యన్నలారా - పాడుడీ యౌదార్యతన్ సర్వేశున్
ఓ యమ్మలారా మ్రొక్కుడీ - ప్రియాతి ప్రియుడేసు
6. ఓ పిల్లలారా కొల్వుడీ - యౌన్నత్యరాజు నేసున్
దపించువారి దాతయౌ - దయామయున్ శ్రీ యేసు
7. శ్రీయేసుకై యర్పించుడీ - మీ యావజ్జీవమును
ప్రియంపు దాసులౌచుచు - రయంబు కొల్వుడేసున్
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
మహావైద్యుండు వచ్చెను బ్రజాళి బ్రోచు యేసుసహాయ Lyrics
Your favourites
- No Favourites found!
