మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు
మహితోటలో నరమొక్కలు నాటించాడు
తన పుత్రుని రక్త నీరు తడికట్టి పెంచాడు
తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు
కాయవే తోట కమ్మని కాయలు
పండవే చెట్టా తియ్యని ఫలములు
1. నీతిపోత జాపికాపు ఆత్మశుద్ధ ఫలములు
నీతండ్రి నిలువ చేయు నిత్యజీవ నిధులు
అనంతమైన ఆత్మపొందు అమర సుఖశాంతులు
అనుకూల సమయమిదే పూయు పరమ పూతలు
2. అపవాది వెంటబడ కుంటుపడిపోకుము
కాపు పట్టి చేదు పళ్ళు గంపలుగా కాయకు
వెర్రిగా చుక్కలంటి ఎదిగి విర్రవీగకు
అదిగో గొడ్డలి వేరున పదును పెట్టియున్నది
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు Lyrics
Your favourites
- No Favourites found!
