Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మహిమ, ఘనత, స్తుతి ప్రభావము నీకే Telugu Christian Song Lyrics

మహిమ, ఘనత, స్తుతి ప్రభావము నీకే Lyrics

మహిమ, ఘనత, స్తుతి ప్రభావము - నీకే కలుగును గాక ఆ. ఆ.
నీకే కలుగును గాక మా దేవా - నీకే కలుగును గాక !
1. బుద్ధి, జ్ఞాన సర్వ సంపదలు - నీ దానములే జ్ఞాన స్వరూపి (2)
జగమును సౄష్టించి - నిర్వహించు వాడవు (2)
నీ జ్ఞానమును - వివరింపతరమా (2)
నీ జ్ఞానముతో నింపు మమ్ము మాదేవా - నీ జ్ఞానముతో నింపు మమ్ము
2. వెండి బంగారు అష్టైశ్వర్యములు - నీ దానములే శ్రీ మంతుడా
శ్రేష్ఠ ఈవులనిచ్చు - జ్యోతీర్మయుడవు
నీ మహిమైశ్వర్యం - వివరింపతరమా
నీ మహిమైశ్వర్యమిమ్ము మా దేవా - నీ మహిమైశ్వర్యమిమ్ము
3. అధిక బలము సంపూర్ణ శక్తి - నీ దానములే యుద్దశూరుడా
నీ కసాద్యమైనది లేదే యెహోవా
నీ సర్వశక్తిని - వివరింపతరమా
నీ సర్వశక్తితో నింపు మా దేవా - నీ సర్వశక్తితో నింపు
4. శాశ్వతమైనది నీ మధుర ప్రేమ - జ్ఞానమునకు మించు ప్రేమాస్వరూపీ
కొలువగలేము నీ - ఘనప్రేమను
సాటిలేని నీ ప్రేమన్ వివరింపతరమా
నీ ప్రేమతో నింపు మమ్ము మా దేవా - నీ ప్రేమతో నింపు మమ్ము
5. ఆర్పగలేము నీ ప్రేమ అగ్నిని - అగాధ సముద్రముల్ జ్వాలామయుడా
మరణమంత బలమైన - నీ ప్రేమ ధాటిని
అగపె ప్రేమను - వివరింప తరమా
అగపే ప్రేమతో నింపు మా దేవా - అగపే ప్రేమతో నింపు


Your favourites

  • No Favourites found!