మహిమ మహిమ మహిమ యనుచు శిశువులు నిర్మల వినోద
ధ్వనులు నిలుతురు అహమ మా యఘంబు లెల్ల నణ(చె వీని నామమనుచు
బహు విధంబులైన పాట ల్బాడుచు నాడుచు వేఁడుచు గూడుచు ||మహిమ||
1. శత సహస్ర సంఖ్య మించి బాల సం చయము ప్రభుని గద్దె చుట్టున
నతులితంబు లైన కాంతి గతుల నమర మింటఁ బాడ నీతీరు నెవరు
దెచ్చి రచటి కేగతిఁ దాఁగూడి మ్రోగఁగ సాగిరి ||మహిమ||
2. వింతయైన మతులు జేయఁగా నెవఁడు తనదు విలువలేని నల్లఁ
జల్లగ సమసెనో యఘంబు లట్టి జనకుఁడైన ప్రభువు నెదుట నమల
కోమలంబులైన యాటలఁ బాటల మీటుచుఁ జాటుచు ||మహిమ||
3. తాము ప్రభుని కృపను మిగులను జూచి యతని దయను లోక మందు
వేడ్కను బ్రేమఁజెంది యిపుడు గొఱ్ఱె పిల్లయైన ప్రభువు నెదుట దాము
మోద మలర నిలిచి వేమరు దామెల్ల నా మోముఁ బ్రేమించి ||మహిమ||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
మహిమ మహిమ మహిమ యనుచు శిశువులు Lyrics
Your favourites
- No Favourites found!
