Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మహిమ నీకే ఘనత నీకే Telugu Christian Song Lyrics

మహిమ నీకే ఘనత నీకే Lyrics

మహిమ నీకే ఘనత నీకే – నీతి సూర్యుడా (2)

న్యాయాధిపతియైన నా యేసయ్యా – నీకే ఆరాధన (2)

ధనవంతులను అణచేవాడవు

జ్ఞానులను సిగ్గుపరచువాడవు (2)

దరిద్రులను లేవనెత్తువాడవు – నీవే రాజువు (2)

యుద్ధవీరుడా శూరుడా

లోకాన్ని గెలిచిన యేసయ్యా (2)

మార్గమే తెలియని అబ్రహామును – అనేకులకు తండ్రిగా చేసినావు

నెట్టివేయబడిన యోసేపుచే – అనేకులను కాపాడినావు            ||దరిద్రులను||

గొఱ్ఱెలకాపరియైన దావీదును – అనేకులకు రాజుగా చేసినావు

నోటి మాంద్యముగల మోషేచే – అనేకులను నడిపించినావు           ||దరిద్రులను||

Your favourites

  • No Favourites found!