మహిమ నీకే ప్రభూ – ఘనత నీకే ప్రభూ (2)
స్తుతి మహిమ ఘనతయు – ప్రభావము నీకే ప్రభూ (2)
ఆరాధనా… ఆరాధనా… (2)
ప్రియ యేసు ప్రభునకే – నా యేసు ప్రభునకే
||మహిమ||
సమీపింపరాని తేజస్సునందు
వసియించు అమరుండవే
శ్రీమంతుడవే సర్వాధిపతివే
నీ సర్వము నాకిచ్చితివే (2) ||ఆరాధనా||
ఎంతో ప్రేమించి నాకై ఏతించి
ప్రాణము నర్పించితివే
విలువైన రక్తం చిందించి
నన్ను విమోచించితివే (2) ||ఆరాధనా||
ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి
నను పిలచి వెలిగించితివే
నీ గుణాతిశయముల్ ధరనే ప్రచురింప
ఏర్పర్చుకొంటివే (2) ||ఆరాధనా||
