Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మహిమ సర్వోన్నతమైన దైవమునకి మ్మహి సమాధానానుగ్రహము Telugu Christian Song Lyrics

మహిమ సర్వోన్నతమైన దైవమునకి మ్మహి సమాధానానుగ్రహము Lyrics

మహిమ సర్వోన్నతమైన దైవమునకి మ్మహి సమాధానానుగ్రహము గల్గున్ర్పభో ||మహిమ||

1.
నిన్ను స్తోత్రించుచు నిన్ను బూజించుచు
నిన్ను మహిమపర్చుచున్నాము లోక ప్రభో ||మహిమ||

2.
ప్రభువైన దేవుండా పరమండలపు రాజా ప్రబలంబు గల తండ్రి
పరిశుద్ధంబగు ప్రభో ||మహిమ||

3.
వినయంబుతో నీదు ఘన మహిమార్థంబై వందనములర్పించి
వినుతింతుము సత్ర్వభో ||మహిమ||

4.
జనితైక పుత్రుడగు ఘన క్రీస్తేసు ప్రభు దేవుని గొర్రెపిల్ల
జనకుని కుమారుడ ప్రభో ||మహిమ||

5.
ధర పాపములమోయు వరపుణ్య శీలుండా కరుణించి మా
బీద మొరలాలించుము ప్రభో ||మహిమ||

6.
తండ్రియైన దేవుని దక్షిణ్ భాగమున గూర్చుండి యున్నావు
కృపజూపుమి సత్ర్పభో ||మహిమ||

7.
పరిశుద్ధుడవు నీవే పరమ ప్రభుడవు నీవే
దురితాత్ములను గాన మరణంబైతివి ప్రభో ||మహిమ||

8.
పరమ జనకుని మహిమన్ పరిశుద్దాత్మైక్యంబై
సరణి మాకై యున్న సర్వోన్నత ప్రభో ||మహిమ||

Your favourites

  • No Favourites found!